Share News

నీళ్లియ్యమని నన్ను అడగొద్దు

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:10 AM

‘‘పండబెట్టి తొక్కుతా.. పంటలు ఎండిపోయినయని నీళ్లు అడుగుతున్నరేంది? అనేక రకాలుగా మోసం చేసి ఇక్కడిదాకా వచ్చినం.

నీళ్లియ్యమని నన్ను అడగొద్దు
BRS

  • ఎంతోమందిని తొక్కుకుంటూ వచ్చా..

  • బ్రహ్మాండంగా పాలించమంటే ఎలా?

  • నాకు అనుభవం ఉందా అధ్యక్షా?

  • తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ మాక్‌అసెంబ్లీ

  • సీఎంగా తలసాని.. రేవంత్‌రెడ్డిపై సెటైర్లు

  • మంత్రి పొంగులేటిలా గంగుల

  • మంత్రి ఉత్తమ్‌లా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

  • అధికార కాంగ్రెస్‌ నేతలపై వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘పండబెట్టి తొక్కుతా.. పంటలు ఎండిపోయినయని నీళ్లు అడుగుతున్నరేంది? అనేక రకాలుగా మోసం చేసి ఇక్కడిదాకా వచ్చినం. 50- 60 ఏళ్లు కాంగ్రె్‌సలో ఉన్నవారిని తొక్కుకుంటూ వచ్చిన. దాని గురించి అడుగు చెప్తా. నాకు అనుభవం ఉందా అధ్యక్షా? పరిపాలన చేయమంటే ఎట్లా?’’ అంటూ బీఆర్‌ఎస్‌ నేత తలసాని శ్రీనివా్‌సయాదవ్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని అనుకరిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాసనసభ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడంతో వారు శనివారం తెలంగాణ భవన్‌లో మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు.


ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. రేవంత్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. స్పీకర్‌గా జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పాత్రలో గంగుల కమలాకర్‌.. వారిని అనుకరిస్తూ మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులుగా వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌ పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలను మాక్‌ అసెంబ్లీలో ప్రశ్నించారు. అధికార కాంగ్రె్‌సపై తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఏ వంద రోజులో చెప్పామా?

మాక్‌ అసెంబ్లీలో సీఎం పాత్రలో తలసాని మాట్లాడుతూ ‘100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాం. కానీ, ఏ వంద రోజుల్లో చేస్తామో చెప్పామా? 25 ఏండ్లు మేమే ఉంటాం.. ఎప్పుడో ఒకప్పుడు అమలు చేస్తాం. బ్రహ్మాండంగా పాలన చేయమంటే ఎలా? నాకు అనుభవం లేదు. తెలిసిందల్లా తొక్కడమే’ అంటూ వ్యాఖ్యానించారు. అనుభవం ఉన్న భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని, వారు లేకపోతే పొంగులేటి ఉన్నారని చెబుతూ కాంగ్రెస్‌ మంత్రివర్గంపైనా పంచ్‌లు వేశారు. ‘ఢిల్లీలో సమస్యలున్నాయి. పార్టీలో సమస్యలున్నాయి. చివరకు బీఆర్‌ఎ్‌సతో కూడా ప్రశాంతత లేదు’ అంటూ సెటైర్లు వేశారు. ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. మంత్రి ఉత్తమ్‌లా తలకు ఆకుపచ్చ రంగు తలపాగా కట్టుకొని ఆయనలాగే మాట్లాడారు. ‘బ్యాంకు చెక్కులు అంటే నాకు అర్థమవుతుంది.


క్యూసెక్కులు అంటే ఎలా అర్థమవుతుంది? ఇవేవీ నేను ప్రిపేర్‌ కాలేదు’ అంటూ నీటిపారుదల శాఖ వ్యవహారాలను గతంలో ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యను వ్యంగ్యంగా ప్రస్తావించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తే కేసీఆర్‌కు పేరొస్తది. మేమేందుకు చేస్తాం’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పరోక్ష విమర్శ చేశారు. ‘ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి రమ్మంటే.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిట్జీ సమావేశం అనుకున్నా. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అని తెలియదు’ అంటూ ఉత్తమ్‌పై మరో పంచ్‌ వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణమంటూ మరో వ్యంగ్య వ్యాఖ్యను జోడించారు. ‘కర్ణాటకలో 40శాతం కమీషన్‌ తీసుకుంటున్నరు. మేం 30శాతం తీసుకోవద్దా?’ అని ప్రశ్నించారు.


కమీషన్లు నేను ఒక్కడినే తీసుకోవడం లేదు అధ్యక్షా!

మంత్రి పొంగులేటి పాత్రలో గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, ‘‘నేను ఒక్కడినే కమీషన్లు తీసుకోవడం లేదు అధ్యక్షా! రాజకీయాల్లో పెట్టిన ఖర్చులను తిరిగి సంపాదించుకోవాలి కదా!’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ను తొక్కి ఇక్కడికి వచ్చానంటూ రాజకీయ ఆధిపత్యంపై సెటైర్‌ వేశారు. ‘భూ భారతి కాదు.. భూ హారతి చేస్తాం’ అంటూ పొంగులేటిపై పరోక్ష విమర్శలు చేశారు. ‘మైనింగ్‌ అంటే మై ఎర్నింగ్‌ అధ్యక్షా!’ అనే పంచ్‌ డైలాగ్‌ మాక్‌ అసెంబ్లీలో ఆకట్టుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

22ఏలో దొరల దోపిడీ
నిషేధిత జాబితాలోని ఉపశమనం ఏది?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 04:10 AM