అసెంబ్లీలో 22Aపై చర్చ.. రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Sep 15 , 2026 | 06:05 PM
రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని MCRHRDలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. 22Aపై చర్చ - బుధవారం అసెంబ్లీలో 22A పై చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ సమీక్షించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని MCRHRDలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. 22Aపై చర్చ - బుధవారం అసెంబ్లీలో 22A పై చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా 22A జాబితాపై సీఎం రేవంత్‌కు రెవెన్యూ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, సీఎస్ సంజయ్ జాజుతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్ష సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు, వివేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం అసెంబ్లీలో 22ఏ, ఎల్ నినోపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి వారు చర్చించారు.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి: డిప్యూటీ సీఎం
నవంబర్19 నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ తొలి విడత సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ఆయన సమీక్షించారు. రూ. లక్ష లోపు స్వయం ఉపాధి యూనిట్లకు తొలి విడత ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాల్లో కేంద్రీకృత యంత్రాలతో వంటశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మెకనైజ్డ్ కిచెన్ల ఏర్పాటుకు రూ. 25 కోట్ల నిధుల విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల్లో కేంద్రీకృత వంటశాలలపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీ గురుకులాల పూర్వ విద్యార్థుల సమగ్ర డేటాబేస్ రూపొందించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల స్థితిగతులపై సీఈఎస్ఎస్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలని తెలిపారు. స్టడీ సర్కిళ్ల పనితీరుపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని తెలిపారు. ఎస్సీ డిగ్రీ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. 26 ఏకలవ్య పాఠశాలల నిర్మాణ ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు అధికారులు వివరించారు. ఈ సమీక్షకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్ల శుద్ధి.. వారిని అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు
శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసు.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
For More TG News And Telugu News