Share News

ఆదాయ సమీకరణపై సీరియస్‌గా ఫోకస్ పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:36 PM

ఆదాయ సమీకరణపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు

ఆదాయ సమీకరణపై సీరియస్‌గా ఫోకస్ పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్, జులై 1: ఆదాయ సమీకరణపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్‌తో పాటు వివిధ శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలని సూచించారు. ఈరోజు(బుధవారం) ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్‌డీ(MCRHRD)లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆదాయ సమీకరణకు సంబంధించి ఛేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు.


అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా డిపార్ట్‌మెంట్స్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. AI టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను డీబీటీ(DBT)కి అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలన్నారు. భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచనలు చేశారు. ఊహాజనిత బడ్జెట్ కాదని.. వాస్తవికత ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు. వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందే అని మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారులు రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

బైక్ దొంగతనాల ముఠా అరెస్ట్.. 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం

‘మీ పదవి మరికొన్ని నెలలు మాత్రమే’.. సీఎం రేవంత్‌‌పై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 04:40 PM