ధరణి పేరుతో రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగింది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:43 PM
ఈ రోజు (బుధవారం) జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పేరిట బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై ఎంక్వైరీ కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరిట జరిగిన భూ కుంభకోణంపై స్పెషల్ ఎంక్వైరీ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. మొత్తం కుంభకోణాన్ని ఆధారాలతో సహా నెల రోజుల్లో బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.
‘బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగింది. వారి దోపిడీపై విచారణ చేయిస్తాం.. ఈ దోపిడీని క్షమిస్తే చరిత్ర మనల్ని క్షమించదు.. ఇది ప్రారంభం మాత్రమే.. మీరు చేసిన తప్పులకు తలవంచుకోవాలి. ముక్కు భూమికి రాయాలి. ఆ రోజు కచ్చితంగా వస్తుంది..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.
ఇప్పటివరకూ అసెంబ్లీలో చెప్పుకొచ్చింది ధరణి పార్ట్-1 మాత్రమే.. ధరణి అక్రమాలు పార్ట్-2 ఇంకా బాకీ ఉందని ఆయన అన్నారు. ‘శాసన సభలోనే బీఆర్ఎస్ బండారాన్ని బయటపెడుతాం.. ఈ సారి వారు సభకు వచ్చేలా స్పీకర్ చూడాలి.. నా కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం లేకనే.. వారు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. బడ్జెట్ సెషన్స్‌లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC )లో జరిగిన భూఅక్రమాలను కూడా బయటపెడుతాం..’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
Read Latest Telangana News And Telugu News