చంచల్‌గూడ జైలులో ఓపెన్ స్కూల్
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:12 AM
జైలు బయట ఉన్న ఖైదీల పిల్లలకు చదువుల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వివరాలతో జైళ్ల శాఖ ద్వారా వినతిపత్రం ఇవ్వవచ్చని, అవసరమైన సహాయం చేస్తామని తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా తెలిపారు.
టాస్ సహకారంతో ఏర్పాటు
ప్రారంభించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
సైదాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జైలు బయట ఉన్న ఖైదీల పిల్లలకు చదువుల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వివరాలతో జైళ్ల శాఖ ద్వారా వినతిపత్రం ఇవ్వవచ్చని, అవసరమైన సహాయం చేస్తామని తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా తెలిపారు. ఖైదీలకు విద్యావకాశాలు కల్పించి వారిని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జైళ్లశాఖ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) సహకారంతో చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూల్‌ను జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, టాస్ డైరెక్టర్ కె.లింగయ్యతో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు.
విద్య కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఇస్తుందని అన్నారు. విద్య అజ్ఞానమనే చీకటిని తొలగించి జీవితంలో ఆశాజ్యోతిని వెలిగిస్తుందని తెలిపారు. ప్రోత్సాహంగా ప్రతి ఖైదీకి కోర్సు ఫీజులో రూ.1,250 రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. జైళ్లలో లైబ్రరీల ఏర్పాటుకు స్పాన్సర్‌షిప్, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా మాట్లాడుతూ... ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ విద్యలో చేరేందుకు 85 మంది ఖైదీలు ముందుకు వచ్చారని తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమం ద్వారా 2025లో 23,220 మంది ఖైదీలకు అక్షరజ్ఞానం కల్పించినట్లు తెలిపారు. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఓపెన్ స్కూలింగ్(నియోస్) నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 78 మంది ఖైదీలు ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News