Share News

కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను త్వరితగతిన రాబట్టండి: సీఎస్‌

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:02 AM

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎస్‌) కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన రాబట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను త్వరితగతిన రాబట్టండి: సీఎస్‌
Sanjay Jaju

హైదరాబాద్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎస్‌) కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన రాబట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. సీఎ్‌సఎస్‌ నిధులపై ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, పంచాయతీరాజ్‌, గ్రా మీణాభివృద్ధి, విద్య, సంక్షేమం, హోం, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి, రవాణా, పశు సంవర్థక శాఖలు నిధుల వివరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిధులను త్వరితగతిన రాబట్టే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.


‘పీఎం రాహత్‌’లో ఆస్పత్రులను నమోదు చేయించండి

రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్సలు, ఆర్థిక సహాయాన్ని అందించే ‘పీఎం రాహత్‌’ పథకంలో రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులను నమోదు చేయించాలని సీఎస్‌ సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. ‘పీఎం రాహత్‌’ పథకంపై ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రోడ్డు ప్రమాద బాధితులను ‘గోల్డెన్‌ అవర్‌’లో సమీపంలోని ఆస్పత్రికి చేర్చితే పథకం కింద రూ.లక్షన్నర విలువైన చికిత్సలు అందిస్తారన్నారు. రాష్ట్ర ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యికి పైగా ఆస్పత్రులు నమోదు కాగా ‘పీఎం రాహత్‌’లో కేవలం 469 ఆస్పత్రులు మాత్రమే ఎన్‌రోల్‌ అయ్యాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వారంలో అనుమతులివ్వకుంటే కాలేజీలు బంద్‌

పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!

న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 06:02 AM