Share News

సీబీఎస్ఈలో తెలుగుకు అన్యాయం

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:52 AM

రాష్ట్రంలోని సీబీఎస్ఈ పాఠశాలల్లో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని ఆ పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఎస్ఈలో తెలుగుకు అన్యాయం

  • తెలుగు ఉపాధ్యాయుల ఆందోళన

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సీబీఎస్ఈ పాఠశాలల్లో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని ఆ పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎస్ఈలో ప్రస్తుతం 9, 10వ తరగతుల్లో అమల్లో ఉన్న వెన్నెల-5 తెలుగు పుస్తకాలను తొలగించి.. గతంలో కొనసాగించిన సింగిడి-1, సింగిడి-2 పుస్తకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.


తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో ఆదివారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన సమావేశంలో నగర సీబీఎస్‌ఈ పాఠశాలల తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సీబీఎస్ఈ స్కూళ్లలో ద్వితీయ భాషగా తెలుగులో రెండేళ్ల క్రితం సింగిడి పుస్తకాలుంటే.. ఈ ఏడాది నుంచి వెన్నెల-5 అమలు చేస్తున్నారన్నారు. 9, 10వ తరగతుల తెలుగు పుస్తకాల్లో నాణ్యత లేదని, వ్యాకరణం సరిగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్మా అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:52 AM