Share News

స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కుల దురహంకార వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:19 AM

దేశంలో కులవివక్ష తీవ్రంగా కొనసాగుతోందని, దళితులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అవమానాలకు గురికాక తప్పడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.

స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కుల దురహంకార వ్యాఖ్యలు
Manda Krishna Madiga

  • ఉన్నత స్థాయికి ఎదిగినా దళితులపై కుల వివక్ష

  • జస్టిస్‌ గవాయ్‌, ఖర్గే ఉదంతాలూ ఇందుకు సాక్ష్యం

  • కుల వ్యవస్థ రద్దు కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం

  • వచ్చే నెల 7న అమరావతిలో

  • జాతీయ సదస్సు: మంద కృష్ణ మాదిగ

మడికొండ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో కులవివక్ష తీవ్రంగా కొనసాగుతోందని, దళితులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అవమానాలకు గురికాక తప్పడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌, దళితుడైన బీఆర్‌ గవాయ్‌పై బూటు విసిరి దాడి చేశారని, ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు, దళితుడైన మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లో సభపెట్టి ప్రసంగిస్తే కొందరు కుల ఉన్మాదులు ఆ సభ ప్రాంగణాన్ని పాలతో శుద్ధి చేశారని చెప్పారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి కుల దురహంకార ఎమ్మెల్సీ తాతా మధు ఘోరమైన పదం వాడి అవమానించారని మండిపడ్డారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఎమ్మార్పీఎస్‌, ఎంఎ్‌సపీ జాతీయ సదస్సులో మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. కుల వ్యవస్థ రద్దు కోసం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. కుల, మత, వర్గ వివక్ష నిర్మూలన కావాలన్నారు. బుద్ధుడి నుంచి అంబేడ్కర్‌ వరకు మహనీయులు కలలుగన్న నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పారు. అందులో భాగంగా అక్టోబర్‌ 7వ తేదీన అమరావతిలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎ్‌సపీ కమిటీల జాతీయ సదస్సు నిర్వహించి, ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం అవుతామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

దళితులు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి
1100 ఎకరాల భూసేకరణ.. బుల్లెట్‌ రైల్‌ పనుల వేగవంతం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 07:21 AM