Share News

దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడమా?

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:32 AM

రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవిలో ఉన్న దళిత బిడ్డను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిందిపోయి... ఫామ్‌హౌ్‌సకు సమీపంలో దళితులు ధర్నా చేసిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్య అని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడమా?
Adluri Laxman Kumar

  • వారిపై బీఆర్‌ఎస్‌ చిన్నచూపునకు ఇదే నిదర్శనం

  • కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

  • బీఆర్‌ఎస్‌ తీరుపై మంత్రి అడ్లూరి ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవిలో ఉన్న దళిత బిడ్డను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిందిపోయి... ఫామ్‌హౌ్‌సకు సమీపంలో దళితులు ధర్నా చేసిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్య అని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితుల పట్ల బీఆర్‌ఎ్‌సకు ఉన్న చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం సాధించుకున్న రాష్ట్రంలో ఇలాంటి సామాజిక వివక్షకు తావివ్వడం తెలంగాణ సమాజం తలదించుకునే దుర్ఘటన అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాజీ సీఎం కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ వేదికగా బుధవారం బీఆర్‌ఎస్‌ అహంకారపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం తమ కార్యకర్తలతో పసుపు నీళ్లతో శుద్ధి చేయించడం వెనుక ఉన్నది వారి దళిత వ్యతిరేక ఆలోచనా విధానమేనని ఆరోపించారు. ‘ఇది కేవలం ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం కాదు.. రాజ్యాంగ వ్యవస్థను, అసెంబ్లీ గౌరవాన్ని, లక్షలాది మంది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ సమర్థిస్తారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, పనితీరును ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతిపక్షానికి ఉందని మంత్రి అన్నారు. అయితే.. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తులను అవమానించడం, రాజ్యాంగబద్ధ పదవులను కించపరచడం సమర్థనీయం కాదన్నారు. ప్రజల తీర్పును ప్రతి రాజకీయ పార్టీ గౌరవించాలన్నారు. శాసనసభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రజాస్వామ్య సంప్రదాయలకు విరుద్ధమని అడ్లూరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

దళితులు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి
స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కుల దురహంకార వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 07:32 AM