Share News

కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్‌!

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:43 AM

బీఆర్‌ఎస్‌ నేతల ఫాంహౌస్‌లు, ఆస్తులపై కాంగ్రెస్‌ చేపడుతున్న పర్యటనలకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ కీలక నేతల ఆస్తుల వద్దకు వెళ్లేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేటీఆర్‌ నేతలతో చర్చించి, కాంగ్రెస్‌ నేతల భూములు, ఫాంహౌస్‌ల వివరాలను సేకరించి త్వరలో బస్సుయాత్ర చేపట్టే అంశంపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్‌!
BRS counter bus yatra

  • రలో బస్సుయాత్ర చేపట్టనున్న గులాబీ నేతలు?

  • అధికార పార్టీ చర్యలకు ప్రతిపక్షం కౌంటర్‌ ప్లాన్‌

  • కాంగ్రెస్‌ కీలక నేతల

  • భూములు, ఆస్తుల గుర్తింపు

  • ఆ తర్వాత ముట్టడికి యోచన

  • ముఖ్యనేతలతో కేటీఆర్‌ చర్చ

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కీలక నేతలు భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ వారి ఫాంహౌ్‌సల వద్దకు వెళుతున్న అధికార కాంగ్రెస్‌ నేతల చర్యలకు.. ప్రతిపక్ష పార్టీ కౌంటర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. తాము కూడా కాంగ్రెస్‌ కీలక నేతల ఆస్తుల వద్దకు వెళ్లాలని యోచిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్దకు బస్సుయాత్రగా వెళ్లిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు.. ఆ తరువాత వరుసగా కేటీఆర్‌, హరీశ్‌రావు, పార్టీ ఇతర ముఖ్యనేతలకు చెందిన వ్యవసాయ క్షేత్రాలకు వెళుతుండడం తెలిసిందే.


అక్కడ ఆయా ఫాంహౌ్‌సల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ కూడా కౌంటర్‌గా ఇదే కార్యక్రమం చేపట్టేలా వ్యూహం రచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతల ఫాంహౌ్‌సలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి.. వారితరహాలో బస్సు యాత్ర చేపట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? ఎక్కడ ఫాంహౌ్‌సలు ఉన్నాయి? ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర ద్వారా వెళ్లే అవకాశం ఉందా? అనే అంశాలపై వారు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, తుల ఉమ, ఇతర ముఖ్యనేతలతో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. బస్సుయాత్ర చేపట్టేందుకు ప్రాథమికంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు, వచ్చే వారం, పది రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత ఒకరు చెప్పారు. అయితే ఏయే కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు వెళతారు? యాత్రకు ఎవరు నాయకత్వం వహిస్తారు? తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.


హరీశ్‌ ఫాంహౌస్‌.. ఓ మంత్రి నుంచి కొన్నదే..?

అజీజ్‌నగర్‌లో మాజీ మంత్రి హరీశ్‌కు చెందిన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న భూమి.. అధికార కాంగ్రె్‌సకు చెందిన ఓ మంత్రి నుంచి కొన్నదేనని అంటున్నారు. సదరు మంత్రి ద్వారా హరీశ్‌రావు 2013-14లో 6 ఎకరాలు కొనుగోలు చేసి, ఆ తర్వాత రైతుల వద్ద మరో రెండెకరాలు కొన్నట్లు సమాచారం. అయితే హరీశ్‌కు చెందిన ఫాంహౌ్‌సలో విశ్రాంతి భవనాలు, లగ్జరీ నిర్మాణాలు ఏవీలేవని, అక్కడ పనిచేసే వారికోసం గదులు నిర్మించినట్లు సమీపంలోని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడ వివిధ రకాల కూరగాయలు, ధాన్యం పండించడంతోపాటు పాలిచ్చే పశువులు, గొర్రెలు, కోళ్లు వంటివి పెంచుతున్నట్లు వారు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగదీశ్‌రెడ్డికి వందల కోట్ల ఆస్తులు
430 జీసీసీలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:43 AM