Share News

చెక్కులు దొంగిలించి రూ.46 కోట్లు డ్రా.. తోబుట్టువులపై నటి రాధ ఫిర్యాదు

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:54 PM

సొంతవారే తనను మోసం చేశారని అలనాటి ప్రముఖ నటి రాధ.. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పాత చెక్కులను దొంగిలించి తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్ ఏకంగా రూ.46 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

చెక్కులు దొంగిలించి రూ.46 కోట్లు డ్రా.. తోబుట్టువులపై నటి రాధ ఫిర్యాదు

ఇంటర్‌నెట్ డెస్క్: సొంతవారే తనను మోసం చేశారని అలనాటి ప్రముఖ నటి రాధ.. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పాత చెక్కులను దొంగిలించి తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్ ఏకంగా రూ.46 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాధ తన వ్యాపార అవసరాల కోసం ‘ఏఆర్ఎస్ గార్డెన్ స్టూడియో’ పేరుతో ఒక కరెంట్ అకౌంట్ నిర్వహించారు. కరెంటు బిల్లులు, పన్నులు, వివిధ ఖర్చుల కోసం ముందుగానే కొన్ని చెక్కులపై ఆమె సంతకం చేసి ఉంచారు. వాటిని తన గదిలో భద్రపరిచారు. నిరుడు జనవరిలో తన వ్యాపారం పేరును ‘ఆర్ఆర్ గార్డెన్స్’ గా మార్చారు. కొత్త చెక్ బుక్ తీసుకున్న తర్వాత పాత చెక్ బుక్ వాడకాన్ని రాధ నిలిపివేశారు.


మోసం వెలుగులోకి వచ్చింది ఇలా..

తాను సంతకం చేసిన రూ.46 కోట్ల విలువైన 5 పాత చెక్కులను దొంగిలించి అంబిక పేరుతో నగదు ఉపసంహరించుకున్నట్లు ఈనెల 17న రాధ గుర్తించారు. ఆ చెక్కులను తాను తన అక్కకు ఇవ్వలేదని, ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాపారం కోసం ముందుగానే తాను సంతకం చేసి ఉంచిన ఆ చెక్కులను దొంగిలించి నగదు డ్రా చేసుకున్నారని ఆమె వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read:

పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం

'బోన్‌ మ్యారో' టెస్టింగ్‌తో అత్యాచారం కేసు వెలుగులోకి.!

ఇంద్రకీలాద్రికి ఘాట్‌ రోడ్‌ బంద్‌.. భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉచిత బస్సులు

Updated Date - Sep 21 , 2026 | 09:55 PM