Share News

క్షుద్రపూజల ఆరోపణలు.. మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్‌పై హరీశ్ రావు పరువునష్టం దావా

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:01 PM

క్షుద్రపూజలు చేయిస్తున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేశారు.

క్షుద్రపూజల ఆరోపణలు.. మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్‌పై హరీశ్ రావు పరువునష్టం దావా
hareesh rao defamation case on congress leaders

హైదరాబాద్, సెప్టెంబర్ 17: క్షుద్రపూజలు చేయిస్తున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.


ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌కు హరీశ్ రావు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే/ఎంపీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీని దృష్ట్యా హరీశ్ రావు కోర్టులో హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.


కాగా.. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో కరవు కాటకాలు రావాలని, దుర్భిక్షం తాండవం చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు క్షుద్రపూజలు చేయిస్తున్నారని.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలను హరీశ్ రావు కొట్టిపారేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలలో భాగంగా ఈ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.


ఇవీ చదవండి:

ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ

‘సెమీకాన్ ఇండియా-2026’కు ప్రధాని మోదీ శ్రీకారం

Updated Date - Sep 17 , 2026 | 04:22 PM