Share News

18 లేదా 23న కరీంనగర్‌కు నితిన్‌ నబిన్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:16 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

18 లేదా 23న కరీంనగర్‌కు నితిన్‌ నబిన్‌
Nitin Nabin

  • 15న రాజ్‌నాథ్‌, 19న గడ్కరీ పర్యటన

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నితిన్‌ నబిన్‌ ఈనెల 18న కరీంనగర్‌లో పర్యటించే అవకాశముంది. కరీంనగర్‌లో లక్ష మందితో తలపెట్టిన పాదయాత్రకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఇందులో నితిన్‌నబిన్‌ పాల్గొననున్నారు. ఒకవేళ 18న ఆయన రాలేకపోతే, 23న కచ్చితంగా వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 15న హైదరాబాద్‌కు రానున్నారు. డీఆర్‌డీఎల్‌ అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. అలాగే, కేంద్ర మంత్రి గడ్కరీ 19న నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. పనులు పూర్తయిన జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:16 AM