అది యాంటీ భారత్ సమ్మిట్
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:24 AM
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు.
దేశంపై విషం చిమ్మే ప్రయత్నం..
అక్రమ అరెస్టులతో బీజేపీని ఆపలేరు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
భారత్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్: సంజయ్
దేశ వ్యతిరేక శక్తులతో సమ్మిట్: ఈటల
రాంచందర్‌సహా పలువురి గృహ నిర్బంధం
హైదరాబాద్/తార్నాక, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. రాహుల్‌గాంధీ హాజరైన భారత్ సమ్మిట్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే సదస్సు కాదని, దేశ అంతర్గత రాజకీయ పరిస్థితులను విదేశీయులకు వివరించేందుకు కాంగ్రెస్ పెట్టిన కార్యక్రమమని విమర్శించారు. భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసంలో ఓయూ పోలీసులు శనివారం గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అక్రమ అరెస్టులతో బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. రాష్ట్రం తీవ్ర కష్టాల్లో ఉన్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సొమ్మును వెచ్చించి సమ్మిట్లు నిర్వహించడం దారుణమన్నారు. గతంలో రాహుల్‌గాంఽధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ఆర్ధిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ అవమానించారని, ఇప్పుడు విదేశీయులను ఇక్కడికి తీసుకువచ్చి భారత్‌పై విషం చిమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, భారత్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వేదికపై నుంచి రాహుల్‌గాంధీ మధ్యలో వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధుల ముందు భారత్ ప్రతిష్ఠను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని మండిపడ్డారు. విదేశీయుల ముందు భారత్‌ను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇది ముమ్మాటికి దేశద్రోహమేనని మండిపడ్డారు. భారత్ సమ్మిట్ పేరుతో దేశాన్ని వ్యతిరేకించే శక్తులన్నీ ఒకే వేదికపైకి వచ్చాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న రాహుల్.. ముందుగా కాంగ్రె్‌సలో ప్రజాస్వామ్యం ఉందో లేదో చెప్పాలని నిలదీశారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ హక్కులను కాలరాసి లక్షలాది మందిని జైళ్లలో పెట్టిన చరిత్ర కాంగ్రె్‌సదేనన్నారు. కాగా, కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. భారత్ సమ్మిట్ పేరిట దేశ వ్యతిరేక శక్తులతో సమావేశం పెట్టాల్సిన అవసరం ఏంటని ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కనీసం ఎన్నికలు కూడా జరగని 42 ఇస్లామిక్ రాచరిక దేశాలు రాహుల్‌కు ఆదర్శమయ్యాయా? అని నిలదీశారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు స్వయంగా వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి పంపి భారత ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని గుర్తుచేశారు. నేడు రాహుల్ మాత్రం విదేశాల్లో దేశం పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News