Share News

కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర

ABN , Publish Date - Jul 12 , 2026 | 07:08 PM

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను భారతీయ జనతా పార్టీ చేపట్టనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ యాత్రను నిర్వహించనుంది.

కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర

హైదరాబాద్, జులై 12: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను భారతీయ జనతా పార్టీ చేపట్టనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ యాత్రను నిర్వహించనుంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ యాత్ర సాగనుంది. తొలి రోజు కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లిలో ఈ యాత్రను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సింగరేణి కార్మికులను బీజేపీ నేతలు కలవనున్నారు. 14వ తేదీన భూపాలపల్లి కేటీకే 8 మైన్ వద్ద కార్మికులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తాడిచర్ల మైన్స్‌కు వారు చేరుకుంటారు.


గోదావరి ఖని ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. అనంతరం శ్రీరాంపూర్ 3 మైన్స్ విజిటింగ్‌తోపాటు కార్మికులతో వారంతా ఇంటరాక్షన్ అవుతారు. ఆపై మంచిర్యాలలో ఈ యాత్ర ముగియనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో మూడు సభలు, ఐదు చోట్ల కార్మికులతో ముఖాముఖి, సమావేశాలను బీజేపీ నేతలు నిర్వహించనున్నారు.


41 వేల మంది సింగరేణి కార్మికులు, దాదాపు 30 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడంలో భాగంగా బీజేపీ ఈ యాత్ర చేపడుతుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావుతోపాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఆర్‌సీపై కర్ణాటకలో పొలిటికల్ హీట్.. పాక్ జాతీయులు అరెస్ట్

జిమ్‌లో నీళ్లు.. ఆగని వర్కవుట్లు.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 07:17 PM