‘కొత్త కేటాయింపు కాదు’.. తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపుపై భట్టి క్లారిటీ
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:03 PM
సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ -2 కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్, జులై 8: సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ -2 కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. 2013 సెప్టెంబర్ 16న ఈ కోల్ బ్లాక్‌ను ఆనాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ కేటాయించినట్లు చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. మైనింగ్ లీజుకు దరఖాస్తు చేస్తే ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టారని.. ఎమ్‌ఎమ్‌బీఆర్(MMBR) యాక్ట్ రాకముందే ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారని తెలిపారు.
కేంద్ర మంత్రులను కలిసి చరిత్ర మొత్తం వివరించామని భట్టి అన్నారు. రాష్ట్రం నుంచి కొట్లాడి ఈ మైనింగ్ లీజుకు తెచ్చుకున్నామన్నారు. ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్ లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే పని చేయాలని.. ప్రైవేట్ కంపెనీలు పని చేయడానికి అవకాశం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్3కు టెండర్ వేశారని అన్నారు. బీఆర్‌ఎస్ బినామీలు ఆక్షన్‌లో పాల్గొని వాటిని దక్కించుకున్నారన్నారు. ఇన్నాళ్లూ సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ లీజుకు ఇవ్వకపోవడం వల్ల వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. గోదావరి పరిసరాల్లోని కోల్ బ్లాక్స్ అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధం.. సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్
మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందన
Read Latest Telangana News And Telugu News