కేంద్ర పథకాల నిధులను సమర్థంగా వినియోగించాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:36 AM
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు(సీఎ్‌సఎస్), కార్యక్రమాల అమలుపై మరింత దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
కేంద్రానికి రాసిన లేఖలపై సమీక్షించాలి: భట్టి
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు(సీఎ్‌సఎస్), కార్యక్రమాల అమలుపై మరింత దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించి, ఆశించిన ఫలితాలు సాధించాలని సూచించారు. వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులతో మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను పెంచేలా చర్యలు తీసుకోవాలని భట్టి సూచించారు.
ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం నిధులు సమకూరుస్తున్నందున... నిధుల వినియోగంతో పాటు వాటి ద్వారా సాధించే ఫలితాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రులకు రాసిన లేఖలపై కూడా నిరంతరం సమీక్షిస్తూ, పురోగతిని తెలుసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న ‘మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయం’ వంటి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సాగునీరు, పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News