Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 60 శాతం గ్రాంట్‌ ఇవ్వండి

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:25 AM

తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ పథకాలకు కేంద్రం 60శాతం గ్రాంట్‌ ఇవ్వాలని... కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 60 శాతం గ్రాంట్‌ ఇవ్వండి
Prahlad Joshi

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి బీసీ నేతల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, నవంబర్‌ 5(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ పథకాలకు కేంద్రం 60శాతం గ్రాంట్‌ ఇవ్వాలని... కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అధ్వర్యంలో బీసీ నేతలు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే కేంద్రం 60శాతం నిధులు గ్రాంట్‌గా ఇస్తోందని, ఇదే మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా గ్రాంట్‌గా ఇవ్వాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 06:25 AM