బీసీలను అమిత్ షా మోసగించారు: జాజుల
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:37 AM
జన గణనలో బీసీ కుల గణన చేపట్టడం చేతకాక పోతే హోంమంత్రిగా అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జన గణనలో బీసీ కుల గణన చేపట్టడం చేతకాక పోతే హోంమంత్రిగా అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి మోసగించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బీసీలే రాజకీయంగా గోరీ కట్టడం ఖాయమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కులాల లెక్కలు తేల్చాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్నారన్నారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం బీసీ కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించిందని గుర్తు చేశారు. కానీ, తీరా జన గణనలో ఓబీసీ కాలమ్ చేర్చకుండా బీసీలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా.. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించక పోవడం సిగ్గు చేటన్నారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో వేలాది మందితో ఢిల్లీని ముట్టడించి కేంద్రంలోని బీజేపీ సర్కారుకు బీసీల తడాఖా రుచి చూపిస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News