Share News

ఆభరణాల తయారీ పేరుతో రూ.32 లక్షల విలువైన బంగారం స్వాహా!

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:56 AM

కస్టమైజ్డ్‌ ఆభరణాలు తయారు చేసి ఇస్తామని నమ్మబలికి రూ.32 లక్షల విలువైన పాత బంగారాన్ని తీసుకుని మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఆభరణాల తయారీ పేరుతో రూ.32 లక్షల విలువైన బంగారం స్వాహా!
gold jewellery fraud

బంజారాహిల్స్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కస్టమైజ్డ్‌ ఆభరణాలు తయారు చేసి ఇస్తామని నమ్మబలికి రూ.32 లక్షల విలువైన పాత బంగారాన్ని తీసుకుని మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా హనుమకొండ నక్కలగుట్టకు చెందిన ఎం.వినయ్‌కృష్ణ ప్రైవేట్‌ ఉద్యోగి. ఈ ఏడాది మే 16న బంజారాహిల్స్‌ రేషంబాగ్‌లోని ఆర్ణి ఫైన్‌ జువెలరీ యజమానురాలు మిట్టపల్లి శ్రావణి వద్దకు వెళ్లి, తనకు నచ్చిన డిజైన్లలో ఆభరణాలు తయారు చేయడానికి సుమారు రూ.32 లక్షల విలువైన పాత బంగారాన్ని అప్పగించారు.

ఒప్పందం ప్రకారం ఆభరణాలు తయారు చేయకపోవడంతో వినయ్‌ కృష్ణ ఆర్డర్‌ను రద్దు చేసుకున్నారు. బంగారం విలువైన నగదును 283 వారాల్లో తిరిగి చెల్లిస్తానని జూలై 22న శ్రావణి వాట్సాప్‌ ద్వారా హామీ ఇచ్చారు. ఆ తర్వాత బంగారంగానీ, డబ్బులు గానీ ఇవ్వకపోగా అదనంగా మరో రూ.6.37 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.


ఇవి కూడా చదవండి:

అన్షుల్ కాంబోజ్‌కు మద్దతుగా నిలుద్దాం: బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్

వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!

Updated Date - Nov 27 , 2026 | 07:56 AM