అల్లు అర్జున్‌నే వదల్లేదు బండి భగీరథ్‌ను ఎందుకు వదిలేస్తాం: కాంగ్రెస్ నేత
ABN , Publish Date - May 13 , 2026 | 01:06 PM
తప్పు చేస్తే తన కుమారుడిని శిక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను అభినందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం బండి సంజయ్‌కు వచ్చిందన్నారు.
హైదరాబాద్, మే 13: తప్పు చేస్తే తన కుమారుడిని శిక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను అభినందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం బండి సంజయ్‌కు వచ్చిందన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో సామ రామ్మోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌నే వదలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడిని ఎందుకు వదిలేస్తుందని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ విషయంలో బీజేపీ నేతలకు, బీఆర్ఎస్ నాయకులు సహకరిస్తున్నారని విమర్శించారు. తనకున్న అధికారంతో ఈ కేసును బండి సంజయ్ తారుమారు చేసే అవకాశముందని సందేహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి.. ఈ కేసు విచారణకు సహకరించాలని సామ డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఎక్కువైందన్నారు. తప్పు చేసిన వారిని వదిలే సమస్యనే లేదన్నారు. తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కొనేందుకు భయం ఎందుకు? అంటూ బండి సంజయ్‌ను సామ రామ్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్
వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?
Read Latest AP News And Telugu News