అశాస్త్రీయంగా కరువు మండలాల ఎంపిక
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:21 AM
రాష్ట్రంలో కరువు మండలాల ఎంపిక అశాస్త్రీయంగా జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
35 శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలకూ చోటివ్వలేదు
వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రకటించండి: బండి సంజయ్
హైదరాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువు మండలాల ఎంపిక అశాస్త్రీయంగా జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన అనేక మండలాలను జాబితాలో చేర్చకుండా మొక్కుబడిగా కరువు మండలాలను ప్రకటించారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
35 శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలు సైతం కరువు జాబితాలో లేకపోవడం బాధాకరమని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కరువు మండలాల ఎంపికకు ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రమాణాలు ఏమిటో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News