నేను బరాబర్ గురువుల కాళ్లు మొక్కుతా!
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:42 AM
‘మాకు సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పిన గురువుల కాళ్లు బరాబర్ మొక్కుతాం. భవిష్యత్తులోనూ కాళ్లు మొక్కుతూనే ఉంటా. కానీ మీ లెక్క కాళ్లు గుంజి చెప్పులు ఎత్తుకుపోయే వాణ్ని కాదు’ అంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ నుద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భార్యాభర్తల బెడ్రూం సంభాషణలను వినడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా ?
కేటీఆర్ ట్వీట్‌పై బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘మాకు సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పిన గురువుల కాళ్లు బరాబర్ మొక్కుతాం. భవిష్యత్తులోనూ కాళ్లు మొక్కుతూనే ఉంటా. కానీ మీ లెక్క కాళ్లు గుంజి చెప్పులు ఎత్తుకుపోయే వాణ్ని కాదు’ అంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ నుద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, నారాయణగూడలోని కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బండి సంజయ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఓ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. అమిత్ షా కాళ్లు మొక్కుతున్నారని, ఆయన చెప్పులు మోస్తున్నారని.. తెలంగాణ బీజేపీ నాయకుల్లో పదవికి తగ్గ గౌరమైన ప్రవర్తన(డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్) కనిపించడం లేదంటూ కేటీఆర్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
కేటీఆర్ దృష్టిలో దోచుకోవడం, భార్యాభర్తల బెడ్రూం సంభాషణలను వినడం ‘డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా’? అని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేయడం? సర్పంచులు, కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకుండా ఆత్మహత్యల పాలుచేయడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా? అని ప్రశ్నించారు. ప్రజలకు డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఏమిటో తెలుసునని అందుకే బీఆర్‌ఎ్‌సను ఫాంహౌ స్‌కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇక, రాహుల్ గాంధీ ఓ చెల్లని రూపాయి అని, రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హతే లేదన్నారు. పొరపాటున రాహుల్ ప్రధాని అయితే దేశాన్ని ముక్కలు చేస్తారని ఆరోపించారు. భారత్ సమ్మిట్ పేరుతో ప్రధాని మోదీని, ఆరెస్సె్‌సను కాంగ్రెస్ ఆడిపోసుకున్నప్పటకీ.. దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ కలిశారని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘భారత్ సమ్మిట్ పేరుతో రూ.100 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. గిగ్ వర్కర్ల బోర్డుకు పైసలివ్వలేదని, సమ్మిట్‌కు ఖర్చు చేసిన నిధులను ఆ బోర్డుకు ఇచ్చినా.. వాళ్లకైనా మేలు జరిగేదని సంజయ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News