కేటీఆర్ ఓ బ్లాక్ మెయిలర్..
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:52 AM
కేటీఆర్ ఓ బ్లాక్‌మెయిలర్ అని, డబ్బుల కోసం రియల్ వ్యాపారులను బెదిరిస్తున్నాడని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు.
డబ్బుల కోసం రియల్ వ్యాపారులను బెదిరిస్తున్నాడు
బాధితులు ఫిర్యాదు చేస్తే సర్కారు చర్యలు: బల్మూరి
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్ ఓ బ్లాక్‌మెయిలర్ అని, డబ్బుల కోసం రియల్ వ్యాపారులను బెదిరిస్తున్నాడని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటుందన్నారు. గురువారం సీఎల్పీ మీడియా హాల్లో బల్మూరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేటీఆర్ అండ్ టీమ్ ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడిదారులు, వ్యాపారులను బెదిరిస్తోందన్నారు. ఓ విషయంపై ముందుగా కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెడతాడని, ఆ తర్వాత ఆయన అనుకూల సోషల్ మీడియా దానిపై హడావుడి చేస్తుందని చెప్పారు. జేవీ రావుకు చెందిన ఎస్‌ఏఎస్ కంపెనీ విషయంలో ఇదే జరిగిందన్నారు.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు, రైతు గర్జన సభకు డబ్బులు ఇవ్వాలంటూ జేవీ రావును వేధించారని, ఆయన డబ్బులు ఇవ్వడానికి అంగీకరించనందుకు ఇప్పుడు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను చెప్పింది వాస్తవం కాదని చెప్పే ధైర్యం కేటీఆర్‌కు ఉందా అంటూ సవాల్ విసిరారు. కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి కోరారు. మధుయాష్కీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన సర్వోత్తమ్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లో తన తరఫున ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News