నిరంకుశత్వమే పెను ముప్పు
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:13 AM
ప్రపంచవ్యాప్తంగా అధికార కేంద్రీకరణ, నిరంకుశ పాలనా విధానాలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని అర్జెంటీనా సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆల్ర్ఫెడో లాజెరెట్టి అన్నారు.
ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అర్జెంటీనా నేత ఆల్ర్ఫెడో
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా అధికార కేంద్రీకరణ, నిరంకుశ పాలనా విధానాలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని అర్జెంటీనా సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆల్ర్ఫెడో లాజెరెట్టి అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఎన్నికల ద్వారా నిరంకుశ రాజకీయ భావజాలాలు బలపడుతుండడం ఆందోళనకరమని తెలిపారు. భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రజాస్వామ్యం సిద్ధాంతం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.
ప్రపంచంలోని అత్యధిక మంది ప్రజలు ఇప్పుడు నిరంకుశ పాలన కిందనే జీవిస్తున్నారని చెప్పారు. ఎల్‌నినో అనేది వాతావరణ మార్పుల సమస్యల్లో ఒక భాగమని, దీనికి మానవులే కారణమని అన్నారు. ఏఐ వల్ల్ల అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి రావటంతోపాటు కొత్త సమస్యలు, సవాళ్లు కూడా ఎదురవుతాయని తెలిపారు. పిల్లలపై సోషల్‌మీడియా ప్రభావం పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని కాపాడటానికి ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ సంస్థలన్నింటిలోనూ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News