అవినీతి నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత: ఏసీబీ
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:42 AM
అవినీతి నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, చలపతి, రాజేశ్ అన్నారు.
రవాణా శాఖ, ఏసీబీ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం
అవినీతి నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, చలపతి, రాజేశ్ అన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ చట్టరీత్యా నేరమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వోద్యోగులు నిజాయితీతో పనిచేయాలని సూచించారు. రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా, ఏసీబీ విభాగాలు బుధవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవం- 2026ను సంయుక్తంగా నిర్వహించాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈనెల 26 నుంచి నవంబరు 1 వరకు జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమాలను ‘‘సత్యనిష్ఠతో సమృద్ధి’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News