Share News

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:37 PM

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ వెలుగు చూసింది. ఓ ఇంట్లో నుంచి 29 తులాల బంగారంతో పాటు లక్షన్నర నగదు అపహరించుకుని దుండగులు పరారయ్యారు.

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం
Alwal Gold Theft

అల్వాల్, నవంబర్ 1: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ వెలుగు చూసింది. ఓ ఇంట్లో నుంచి 29 తులాల బంగారంతో పాటు లక్షన్నర నగదు అపహరించుకుని దుండగులు పరారయ్యారు. నిన్న (శనివారం) రాత్రి దమ్మాయిగూడలో ఓ శుభకార్యానికి హాజరై అర్ధరాత్రి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

హైదరాబాద్‌లో ఇద్దరు దొంగల అరెస్ట్.. 37 తులాల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లో దారుణం.. మద్యానికి డబ్బులు అడిగిన వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

Updated Date - Nov 01 , 2026 | 04:37 PM