Share News

తెలంగాణకే కాదు.. ఎల్‌నినో ప్రపంచ సమస్య

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:19 AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావ ముందని, ఇది కేవలం తెలంగాణకే పరిమితమైన అంశం కాదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ స్పష్టంచేశారు.

తెలంగాణకే కాదు.. ఎల్‌నినో ప్రపంచ సమస్య
Adluri Lakshman

  • ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నాం: మంత్రి అడ్లూరి

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావ ముందని, ఇది కేవలం తెలంగాణకే పరిమితమైన అంశం కాదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ స్పష్టంచేశారు. సీఎల్పీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఎల్‌నినో అనేది సహజసిద్ధంగా సంభవించే పరిణామమని, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. దీన్ని ప్రభుత్వంపై తోసేసి రాజకీయం చేయడం తగదన్నారు.


ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుచూపుతో ప్రత్యేకంగా ఒక ‘సబ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసిందని వివరించారు. వచ్చే ఏడాది జూలై వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులను ఎంతో ప్రణాళికాబద్ధంగా వాడుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే సూచించారని గుర్తుచేశారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


మరోవైపు, సచివాలయంలో ఆదిలాబాద్‌ జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన సమస్యలపై మంత్రి అడ్లూరి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ అంశం అత్యంత సున్నితమైనదం టూ.. 1950కి ముందున్న ఆధారాలు, అప్పటి చట్టపరమైన పరిస్థితులు, అందుబాటులో ఉన్నరికార్డులు, ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనిపై గ్రామాలు, మండలాల వారీగా పెండింగ్‌ దరఖాస్తులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, నవంబర్‌ రెండో వారంలో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

రోడ్లు వేయరు.. రిపేరు చేయరు

పండుగ వేళ షాపింగ్‌ వెలవెల

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 06:19 AM