మేడే రోజు కేటీఆర్ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారు: అద్దంకి దయాకర్
ABN , Publish Date - May 01 , 2026 | 03:53 PM
సీఎంపై హాట్ కామెంట్స్‌తో నిరంతరం మీడియాలో ఉండాలన్న తపన తప్పితే కేటీఆర్‌కు ఇంకో పని లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌కు ఎవరినో ఒకరిని పిలిపించుకుని చిల్లర మల్లర అహంభావపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మే 1: మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మేడే రోజు కేటీఆర్ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సందర్భానుసారంగా మాట్లాడటం కేటీఆర్ నేర్చుకోవాలని హితవుపలికారు. మేడే రోజు కార్మికులు, వారి సంక్షేమం గురించి మాట్లాడాలన్నారు. మూడేళ్లయినా ముఖ్యమంత్రి పని చేయడం లేదని కేటీఆర్ అంటున్నారని.. పదేళ్లు పని చేయని సీఎంను ఏమనాలని ప్రశ్నించారు. కేవలం సీఎంపై విమర్శలతోనే పార్టీని నెట్టుకురావాలని అనుకోవడం దౌర్భాగ్యమన్నారు. కార్మికుల కోసం ఏం చట్టాలు చేశామో కూడా కేటీఆర్‌కు తెలియదన్నారు.
గిగ్ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలియదా అని దయాకర్ ప్రశ్నించారు. పదేళ్లలో కార్మిక చట్టాలు, సంక్షేమం గురించి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఎలా స్పందించారో అందరికి తెలుసన్నారు. సీఎంపై హాట్ కామెంట్స్‌తో నిరంతరం మీడియాలో ఉండాలన్న తపన తప్పితే కేటీఆర్‌కు ఇంకో పని లేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌కు ఎవరినో ఒకరిని పిలిపించుకుని చిల్లర మల్లర అహంభావపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మాటల వల్ల బీఆర్‌ఎస్ గుండు సున్నా స్థాయికి వచ్చిందన్నారు. సీఎంపై, సీఎం కుటుంబంపై మాట్లాడితే ఉపయోగం ఉండదన్నారు. ప్రజా నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్న తీరు నచ్చకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీలపై డీజీపీ సీవీ ఆనంద్ క్లారిటీ
మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులారా.. జాగ్రత్త!: సీపీ సజ్జనార్
Read Latest Telangana News And Telugu News