నిమ్స్‌లో 4 రోజులుగా ఏసీబీ వరుస తనిఖీలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:29 AM
నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి, అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. నాలుగు రోజులుగా వరుసగా తనిఖీలు జరుపుతోంది. ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆసుపత్రిలోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.
సర్జికల్ స్టోర్స్‌లో రికార్డుల పరిశీలన
మందులు, సర్జికల్ పరికరాల కొనుగోళ్లపై ఆరా
హైదరాబాద్, నిమ్స్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి, అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. నాలుగు రోజులుగా వరుసగా తనిఖీలు జరుపుతోంది. ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆసుపత్రిలోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. డీఎస్పీల నేతృత్వంలో వేర్వేరు బృందాలుగా ఏర్పడి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలిస్తున్నారు. సోమవారం జరిపిన తనిఖీల్లో నిమ్స్ సర్జికల్ స్టోర్స్‌లో రికార్డులు పరిశీలించారు. రెండు దశాబ్దాలుగా ఆసుపత్రిలో కొనుగోలు చేసిన సర్టికల్ పరికరాలకు సంబంధించిన బిల్లులు, పేషెంట్లకు ఉపయోగించినట్లు రికార్డుల్లో పొందుపర్చిన వివరాల్ని సరిచూస్తున్నారు. కొనుగోళ్లు, వినియోగానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లను కూడా ఏసీబీ ప్రత్యేక బృందాలు సోమవారం పరిశీలించాయి. థియేటర్లలో ఉపయోగిస్తున్న యంత్రాలు, పరికరాలు, వాటి కొనుగోళ్లు, బిల్లులకు సంబంధించి ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఓ వైద్య బృందం సహకారం తీసుకుని అన్ని అంశాల్ని పరిశీలించి రికార్డులు, బిల్లులు పరిశీలిస్తున్నారు. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు, వాటి నిల్వలు, వినియోగం, సరఫరాకు సంబంధించిన రికార్డులపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న నిల్వలకు, వాస్తవంగా ఉన్న నిల్వలకు మధ్య వ్యత్యాసాలు, కొనుగోళ్లలో నిబంధనలు పాటించారా లేదా వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. క్యాంటీన్, సెక్యూరిటీ కాంట్రాక్టుల మొదలుకొని ఆపరేషన్ థియేటర్ వరకు పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై ఏసీబీ కీలక ఆధారాలు సేకరిస్తుంది. నిమ్స్‌లో రెండు దశాబ్దాలుగా స్టోర్ ఇన్‌చార్జీలుగా పనిచేసిన నలుగురు మాజీ ఉద్యోగుల్ని పిలిపించి వారి నుంచి సమాచారం సేకరించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News