Share News

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

ABN , Publish Date - May 12 , 2026 | 09:15 PM

బంగారం కొనొద్దని 1967లో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి వివరించారు.

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!
Fake ‘The Hindu’ Clipping on Indira Gandhi’s Gold Warning Goes Viral

ఆంధ్రజ్యోతి, మే 12: ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇదే అదునుగా భావించిన కొందరు ఆకతాయిలు.. 1967లో ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారంటూ ఓ ఫేక్ న్యూస్ క్లిప్పింగ్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే.. 1967 జూన్ 6 నాటి 'ది హిందూ' పత్రికలో అలాంటి వార్తేమీ రాలేదని, అది కేవలం ఎడిట్ చేసిన ఫొటోనే అని స్పష్టమైంది. సదరు ఫేక్ క్లిప్పింగ్ గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి తన 'ఎక్స్' ఖాతా ద్వారా అప్రమత్తం చేశారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ ఫేక్ జిమ్మిక్కుల పట్ల అప్రమత్తతను చాటిచెప్పారు.

కాగా.. 1967 జూన్ 6న The Hindu న్యూస్‌ పేపర్ లుక్ ఇచ్చిన ఆ ఆర్టికల్ క్లిప్ పూర్తిగా ఫేక్. సదరు ఫొటో నిజం కాదు. 1960లలో భారతదేశం విదేశీ మారక నిల్వల సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ.. ఇందిరా గాంధీ Don’t buy gold అనే నినాదం ఇచ్చారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆ కాలంలో గోల్డ్ ఇంపోర్ట్‌లపై నియంత్రణలు ఉన్నప్పటికీ, ప్రముఖ దినపత్రిక ది హిందూలో ఆమె చెప్పినట్టుగా వార్త వచ్చిందన్నది పూర్తిగా అబద్ధం. సదరు న్యూస్‌ పేపర్ క్లిప్పింగ్ ఏఐ జనరేటెడ్ లేదా ఎడిట్ చేసినది మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా ఆ పత్రికా యాజమాన్యం, ఫ్యాక్ట్-చెక్ సంస్థలు కూడా ధ్రువీకరించాయి.


అసలు ఆ రోజు(1967 జూన్ 6) ది హిందూ దినపత్రికలో ఆ వార్త లేదు. చారిత్రక వాస్తవం ఏమిటంటే.. ఇందిర హయాంలో దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గోల్డ్ కంట్రోల్ యాక్ట్(Gold Control Act) వంటి కఠిన నిర్ణయాలు అమలులో ఉన్నాయి. ఆ చారిత్రక నేపథ్యాన్ని వాడుకుంటూ ఎవరో ఈ ఫేక్ క్లిప్పింగ్‌ను సృష్టించారు. ఈ పేపర్ క్లిప్ చూసిన చాలా మంది అది నిజమనుకుంటున్నారని, కానీ సదరు ది హిందూ క్లిప్ ఫేక్ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..

Updated Date - May 12 , 2026 | 09:57 PM