Share News

బండి సంజయ్, ఈటల మధ్య కుదిరిన సయోధ్య

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:16 PM

తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నేతల మధ్య విభేదాలను తొలగించి.. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

బండి సంజయ్, ఈటల మధ్య కుదిరిన సయోధ్య
BJP Telangana

హైదరాబాద్, జులై 18: తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నేతల మధ్య విభేదాలను తొలగించి.. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఎంతో కాలంగా విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చారు.


వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందకు రంగంలోకి దిగిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్.. నేడు ఈటల రాజేందర్, బండి సంజయ్‌తో సమావేశం నిర్వహించారు. ఎంపీ లక్ష్మణ్ నివాసం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఈటల, బండి మధ్య రాజీ కుదిర్చారు. విభేదాలు పక్కనపెట్టి.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు.


భేటీ అనంతరం మీడియా ముందుకు బీజేపీ నేతలు.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదని, కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటూ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై మోదీ ప్రత్యేక చొరవ చూపారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి: మంత్రి తుమ్మల

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. రేవంత్‌కు కేటీఆర్ వార్న్

Updated Date - Jul 18 , 2026 | 04:45 PM