Share News

దానం నాగేందర్ ప్లాన్‌కు చెక్! సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేవియట్ దాఖలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 08:14 PM

దానం నాగేందర్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో ముందస్తుగా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

దానం నాగేందర్ ప్లాన్‌కు చెక్! సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేవియట్ దాఖలు
Danam Nagender Disqualification: BJP, BRS MLAs File Caveat in Supreme Court

ఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 19: దానం నాగేందర్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో ముందస్తుగా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.


తన అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే.. తమ వైపు వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష ఆదేశాలు లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరుతూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఈ కేవియట్ దాఖలు చేశారు.


ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో వచ్చిన తీర్పుల నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ పిటిషన్‌తో సుప్రీం కోర్టు దానం నాగేందర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినప్పుడు, ఈ కేవియట్ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి కానుంది.


ఇవి కూడా చదవండి...

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 08:39 PM