తల్లికి వైద్యం అందడం లేదని.. వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:02 AM
ప్రభుత్వాస్పత్రిలో తన తల్లికి వైద్యం అందించడంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు వినూత్నరీతిలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రిలో తన తల్లికి వైద్యం అందించడంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు వినూత్నరీతిలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తల్లిని వీల్‌చైర్ మీద ఉంచి 2 కిలోమీటర్లు తోసుకుంటూ నేరుగా ఎమ్మెల్యే ఇంటి కి తీసుకెళ్లాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మం డలం పులిమడుగుకు చెందిన భుక్యా బుజ్జి అనే మహిళ మూత్రపిండాల సమస్యతో బాధపడుతోంది.
ఆమె కుమారుడు రాజ్‌కుమార్ మంగళవారం రాత్రి ఆమెను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యసిబ్బంది పట్టించుకోకపోవడంతో తల్లిని వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో సి బ్బంది ఫోన్ ద్వారా విషయం తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్‌ఎంవో శ్రీధర్‌కు ఫోన్ చేయగా.. ఆయన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్యాబినెట్ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Read Latest AP News And Telangana News And International News And Telugu News