మరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొన్న ఆటో.. నలుగురి మృతి
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:03 AM
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని 63వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగిుంది. మరో వాహనాన్ని తప్పించబోయి ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు మహిళలు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఘటన
నస్పూర్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని 63వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగిుంది. మరో వాహనాన్ని తప్పించబోయి ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు మహిళలు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లికి చెంది న చింతకుంట్ల లక్ష్మి (30), అగ్గు సౌందర్య (35), తొగరి సుమలత (25), తొటపల్లి సోనియా (20)లు మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నారు. వీరు నిత్యం స్వగ్రామం నుంచి పనికి ఆటోలో వెళ్లివస్తుంటారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం పనికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో వీరితో పాటు మరో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. లక్ష్మి, సౌందర్య ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తొగరి సుమలత, తొటపల్లి సోనియా కన్నుమూశారు. వీరితో పాటు ఆటోలో ఉన్న సల్లూరి అనుషా, రాంటెంకి దివ్యవాణి, నరమల్ల లక్ష్మి, ఆటో డ్రైవర్ ప్రశాంత్ చికిత్స పొందుతున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న వారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ నలుగురి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News
Updated Date - Sep 29 , 2026 | 04:39 AM