Share News

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:36 AM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
Balka Suman

ఆదిలాబాద్, మార్చి 4: బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయ్యారు. బాల్క సుమన్‌తో పాటు మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు రిమాండ్‌లో ఉన్నారు. మంచిర్యాల, చెన్నూరు కోర్టుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఈరోజు(బుధవారం) ఉదయం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు.


ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ... క్యాతనపల్లిలో మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. బలం లేకున్నా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం కుట్ర చేశారని ఆరోపించారు. అడ్డుకున్న తమపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని సుమన్ అన్నారు.


క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఫిబ్రవరి 17న జరిగిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సమయంలో మంత్రి గడ్డం వివేక్ కాన్వాయ్‌పై దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసి, ఫిబ్రవరి 18న అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌పై బాల్క సుమన్‌‌ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

రెవెన్యూ శాఖలో కోర్టు కేసులు.. పారదర్శకంగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 10:59 AM