Share News

బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:01 AM

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

  • గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ అవగాహన కార్యక్రమంలో వెలుగులోకి

  • పోక్సో కేసు నమోదు.. నిందితుడి అరెస్టు

ఆదిలాబాద్‌ రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


ఈనెల 27న సంబంధిత పాఠశాలలో షీ టీం సభ్యులు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం కొందరు విద్యార్థినులు తమకు ఉపాధ్యాయుడి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, అసభ్య ప్రవర్తన గురించి షీ టీం సభ్యులకు వివరించారు. దీంతో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీసులు నిందితుడు మహేశ్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 75, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 10 ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ సీఐ రహీం పాషా తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 05:01 AM