Share News

వైభవంగా మహా పోచమ్మ జాతర!

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:51 AM

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. రెండు రోజుల పాటు కన్నుల పండువగా జాతర సాగింది.

వైభవంగా మహా పోచమ్మ జాతర!
Adelli Jatara

  • పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

  • ఏలేటి, అల్లోల ప్రత్యేక పూజలు

సారంగాపూర్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. రెండు రోజుల పాటు కన్నుల పండువగా జాతర సాగింది. శనివారం మధ్యాహ్నం పోచమ్మ నగలను అడెల్లి దేవాలయం నుంచి వేల సంఖ్యలో భక్తులు కాలినడకతో 30 కి.మీ దూరంలో ఉన్న గోదావరి నదికి తీసుకెళ్లారు. అక్కడి నీటిలో నగలను శుభ్రంచేసి తిరిగి దేవాలయానికి తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు. దీంతో జాతర ముగిసింది.


ఆదివారం వేకువజామున నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌, చంద్రాపూర్‌ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి పెరుగన్నంను నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు ప్రత్యేక పూజలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 19 , 2026 | 05:51 AM