Share News

ఒక్కసారి చదివాక మాయమైపోయే టెక్ట్స్ మెసేజెస్.. త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

ABN , Publish Date - Nov 12 , 2026 | 07:19 PM

వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. టెక్ట్స్ మెసేజీలకు వివ్ వన్స్ ఆప్షన్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అంటే, చదివిన తర్వాత ఆ మెసేజీలు కనిపించకుండాపోతాయి.

ఒక్కసారి చదివాక మాయమైపోయే టెక్ట్స్ మెసేజెస్.. త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. టెక్ట్స్ మెసేజీలకు వివ్ వన్స్ ఆప్షన్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అంటే, చదివిన తర్వాత ఆ మెసేజీలు కనిపించకుండాపోతాయి. ఇప్పటివరకు అలాంటి ఫీచర్ ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజీలకు మాత్రమే అందుబాటులో ఉంది. మల్టీమీడియా ఫీచర్‌లాగే కొత్త ఫీచర్ పనిచేస్తుంది. సెండర్ నుంచి వచ్చిన మెసేజ్‌ను రిసీవర్ ఒక్కసారి ఓపెన్ చేసి చదివి క్లోజ్ చేసిన తర్వాత ఆ మెసేజ్ మాయమవుతుంది. మళ్లీ వాటిని రిసీవర్ చూడలేరు.


అలాగే ఆ మెసేజ్‌ను రిసీవర్ కాపీ చేయకుండా, స్క్రీన్‌షాట్ తీయకుండా చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. సెలెక్ట్ చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకే ‘వివ్ వన్స్ టెక్ట్స్ మెసేజ్’ ప్రస్తుతం అందుబాటులో ఉంది. వివ్ వన్స్ టెక్ట్స్ మెసేజ్ ఫీచర్‌ను ఎలా వాడుకోవాలో వివరిస్తూ వాట్సాప్ త్వరలో ఓ వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆ యాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లను రిసీవర్లు సేవ్ చేసుకోవడం, ఇతరులతో షేర్ చేసుకోవడం వంటివి కూడా చేయలేరు. అయితే, ఇంకో ఫోన్‌తో ఆ మెసేజ్‌లను ఫొటో తీయకుండా ఉండే ఆప్షన్ వివ్ టెక్ట్స్ మెసేజ్‌లో లేదని వాట్సాప్ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 07:26 PM