Share News

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక స్టిక్కర్లు కూడా మాట్లాడతాయి..!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:16 PM

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఆ ఫీచర్ పుణ్యమా అని ఇకపై స్టిక్కర్లు కూడా మాట్లాడతాయి.

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక స్టిక్కర్లు  కూడా మాట్లాడతాయి..!
WhatsApp sound stickers

ఇంటర్నెట్ డెస్క్: తన వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వడానికి కొంతకాలంగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. వాటితో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ యాప్ మరో వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇదివరకు టెక్ట్స్ మెసేజ్‌లు, ఎమోజీలకు మాత్రమే పరిమితమైన చాటింగ్‌లో స్టిక్కర్లను ప్రవేశపెట్టింది ఆ యాప్. అప్పట్లో ఇవి ఒక్కసారిగా షేక్ చేశాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది స్టిక్కర్లను ఉపయోగించేవారు. ఇప్పుడు అదే స్టిక్కర్‌కు గొంతునివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. దీన్నే ‘సౌండ్ స్టిక్కర్’ అని ఆ యాప్ పిలుస్తోంది.


వాట్సాప్ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్న ‘సౌండ్ స్టిక్కర్’ ఫీచర్‌తో స్టిక్కర్లకు వాయిస్ ఇవ్చొచ్చు. అలాగే వీడియోలో ఒక భాగాన్ని (ఆడియోతో సహా) స్టిక్కర్‌గా మార్చొచ్చు. వీటిని చాట్‌లో వాడుతూ నయా అనుభూతిని పొందొచ్చు. అయితే ఇది యూజర్లు అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. తొలుత ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.41.3లో కనిపించనుంది. తరువాత దశలవారీగా అందరి మొబైల్‌ఫోన్లకూ చేరనుంది. ఈ కొత్త ఫీచర్‌తో స్టిక్కర్లకు ఆడియో యాడ్ చేయడం చాలా సులభం. ఇందుకోసం మొదట కావాల్సిన స్టిక్కర్‌ను ఎంచుకోగానే అక్కడ ‘యాడ్ సౌండ్’ ఆప్షన్ కనబడుతుంది. దాని ద్వారా ఆడియో ఇవ్వొచ్చు. ఒకవేళ వీడియోను స్టిక్కర్‌గా మార్చాలనుకుంటే.. కీబోర్డ్‌లో ‘క్రియేట్ స్టిక్కర్’పై క్లిక్ చేయాలి. తరువాత వీడియో కట్ చేసుకోవాలి అంతే. అయితే చాటింగ్‌లో ఈ రకం స్టిక్కర్ పంపగానే సౌండ్ రాదు. దాని కింద ఆడియో బటన్ ఉంటుంది. అది నొక్కితే మాత్రమే సౌండ్ వస్తుంది.


ఇవీ చదవండి

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా.. కేంద్రం కీలక హెచ్చరిక..

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక గూగుల్ డ్రైవ్ లేకుండానే డైరెక్ట్ బ్యాకప్

Updated Date - Nov 25 , 2026 | 07:29 PM