Share News

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక గూగుల్ డ్రైవ్ లేకుండానే డైరెక్ట్ బ్యాకప్

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:48 PM

తన యూజర్ల కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. చాట్ బ్యాకప్ చేసుకునే వినియోగదారులకు రానున్న కొత్త ఫీచర్ సహాయపడనుందని ఆ యాప్ చెబుతోంది.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక గూగుల్ డ్రైవ్ లేకుండానే డైరెక్ట్ బ్యాకప్

ఇంటర్నెట్ డెస్క్: తన యూజర్ల కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. చాట్ బ్యాకప్ చేసుకునే వినియోగదారులకు రానున్న కొత్త ఫీచర్ సహాయపడనుందని ఆ యాప్ చెబుతోంది. ఇన్ని రోజులూ చాట్ బ్యాకప్‌ కోసం గూగుల్ డ్రైవ్ లాంటి ఇతర క్లౌడ్ సేవలను వాట్సాప్‌ ఉపయోగించేది. ఇతర క్లౌడ్ సేవల అవసరం లేకుండా తన సర్వర్లలోనే బ్యాకప్ చేసుకునే విధంగా ఓ ఫీచర్‌ను ఆ యాప్ పరిచయం చేయబోతోంది. వాట్సాప్ వెర్షన్ 2.26.46.4.లో ఇది కనిపించబోతోంది. బ్యాకప్ కోసం వినియోగదారులకు ఉచితంగా 2 జీబీ స్పేస్ ఇవ్వాలని వాట్సాప్ నిర్ణయం తీసుకుంది.


అయితే ఈ ఫీచర్‌లో మరో విశేషముంది. తన సర్వర్లలో దాచిన చాట్ డేటాను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) విధానంలో వాట్సాప్ రక్షించనుంది. అంటే ఈ సమాచారాన్ని ఎవరూ చూడలేరు, చదవలేరు. వందకు వంద శాతం చాట్ డేటా భద్రంగా ఉంటుంది. బ్యాకప్ కోసం ఉచితంగా ఇచ్చే 2 జీబీ స్టోరేజ్ సరిపోదనుకునే వారు ‘వాట్సాప్ వన్’ తీసుకోవచ్చు. అప్పుడు ఏకంగా 100 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇంకా కావాలనుకుంటే ‘మెటా వన్’ ద్వారా 4 టీబీ వరకూ స్టోరేజ్ పొందొచ్చు. అయితే ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. మీ వాట్సాప్‌లో ఇంకా ఇది కనిపించకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి కొన్ని వారాల్లో ప్రతి యూజర్‌కు ఈ ఫీచర్ చేరుతుంది.


ఈ వార్తలూ చదవండి

పౌరులు, పాఠశాలలపై టార్గెట్.. ఏఐ మోడళ్ల తీరుపై ఆందోళన

వాలంటరీ ఎగ్జిట్‌లు అందుకే: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

Updated Date - Nov 18 , 2026 | 12:54 PM