వేసవిలో ఫోన్ వేడెక్కుతోందా? ఇలా చేస్తే సేఫ్
ABN , Publish Date - May 22 , 2026 | 04:44 PM
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం సాధారణ సమస్యగా మారుతోంది. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం సాధారణ సమస్యగా మారుతోంది. చాలా మంది ఫోన్ హీట్ అవడం, స్లోగా పనిచేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా ఎక్కువసేపు కొనసాగితే ఫోన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. కానీ కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఎండలో ఫోన్ పెట్టొద్దు
ఫోన్‌ను నేరుగా ఎండలో పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా కారు డాష్‌బోర్డ్‌పై లేదా కిటికీ దగ్గర ఉంచితే ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఎప్పుడూ చల్లటి లేదా గాలి వచ్చే ప్రదేశంలో ఉంచడం మంచిది.
గేమింగ్, వీడియోలు తగ్గించండి
గేమ్స్ ఆడటం, వీడియో కాల్స్, హెచ్‌డీ వీడియోలు ఎక్కువసేపు చూడటం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. బయట ఎండలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు తగ్గించడం మంచిది.
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి
బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే ఫోన్ వేడెక్కుతుంది. అవసరానికి తగ్గట్టుగా బ్రైట్‌నెస్ ఉంచడం మంచిది.
ఫోన్ కవర్ తీసేయండి
మందపాటి ఫోన్ కవర్ ఉంటే వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఫోన్ ఎక్కువగా వేడెక్కితే ఛార్జింగ్ సమయంలో కవర్ తీసేయడం మంచిది.
నిర్లక్ష్యం చేయొద్దు
ఫోన్ ఎక్కువ వేడెక్కితే స్క్రీన్ డిమ్ అవ్వడం, యాప్‌లు స్లో అవ్వడం జరుగుతుంది. ఇవి ఫోన్ ఇచ్చే హెచ్చరికలు. ఇలాంటి సమయంలో ఫోన్‌కు కొంత విశ్రాంతి ఇవ్వడం మంచిది.
ఛార్జింగ్ సమయంలో జాగ్రత్త
ఫొన్‌కు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం లేదా వీడియోలు చూడటం వల్ల ఫోన్ మరింత హీట్ అవుతుంది. అలాగే ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడాలి.
ఫ్రీజర్‌లో పెట్టకండి
కొంతమంది ఫోన్ వేడెక్కిన వెంటనే దాన్ని ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో పెట్టడం చేస్తారు. అయితే ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారితే ఫోన్ లోపల తేమ చేరి అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:
ఇంటి మెట్లపై కూర్చోవడం మంచిది కాదా?
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2026.. ప్రకృతిని కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత
For More Latest News