Share News

విజయ్ క్యాబినెట్‌ విస్తరణ.. ప్రభుత్వంలో కొత్తగా మరో ఇద్దరి చేరిక

ABN , Publish Date - May 22 , 2026 | 03:51 PM

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం శుక్రవారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపింది. ప్రభుత్వంలో మరో ఇద్దరికి చోటు కల్పించింది. టీవీకేకు బయట నుంచి మద్దతిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధికార కూటమిలో చేరాయి.

విజయ్ క్యాబినెట్‌ విస్తరణ.. ప్రభుత్వంలో కొత్తగా మరో ఇద్దరి చేరిక
AM Shahjahan and Vanni Arasu

చెన్నై: తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం శుక్రవారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపింది. ప్రభుత్వంలో మరో ఇద్దరికి చోటు కల్పించింది. టీవీకేకు బయట నుంచి మద్దతిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అధికార కూటమిలో చేరాయి. పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏఎం షాజహాన్, తిండివనం నియోదకవర్గం వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసు శుక్రవారంనాడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


టీవీకే ప్రభుత్వం కీలకమైన మంత్రివర్గ విస్తరణ గురువారంనాడు జరిపింది. వీసీకే, ఐయూఎంఎల్‌ను కూడా ప్రభుత్వంలో చేరాలని కోరింది. అయితే పేర్ల ఖరారు విషయంలో ఆ రెండు పార్టీలు జాప్యం చేశాయి. దీంతో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, టీవీకేకు చెందిన 21 మంది ఉన్నారు. దీనికంటే ముందు ముఖ్యమంత్రితో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 35 మందికి క్యాబినెట్‌లో అవకాశం ఉండగా, రెండు ఖాళీలు మిగిలాయి. వీసీకే, ఐయూఎంఎల్ తాజాగా ప్రభుత్వంలో చేరడంలో మంత్రి కొలువుల భర్తీ పూర్తయింది.


కాగా, ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వ విశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే రెబల్ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలకు టీవీకే ప్రభుత్వంలో చోటు దక్కలేదు. గురువారం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేలలోని తొమ్మది మంది షణ్ముగం వర్గానికి దూరంగా ఉండిపోయారు. రాబోయే రోజుల్లో చాలామంది పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి తీరిగి వస్తారని అన్నాడీఎంకే గట్టి నమ్మకంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

భారత్ ఎన్నటికీ తలవంచదు: అమిత్‌షా

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు

Updated Date - May 22 , 2026 | 04:44 PM