Share News

భారత్ ఎన్నటికీ తలవంచదు: అమిత్‌షా

ABN , Publish Date - May 22 , 2026 | 03:03 PM

సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ఇందుకోసం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు.

భారత్ ఎన్నటికీ తలవంచదు: అమిత్‌షా
Amit Shah

న్యూఢిల్లీ: సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. ఇందుకోసం జీరీ టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు. అక్రమ వలసదారులను వెనక్కి తిప్పిపంపుతామని స్పష్టం చేశారు.


న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారంనాడు జరిగిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, అక్రమ వలసలను కృత్రిమంగా దేశ జనాభాలో మార్పు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. దేశ డెమోగ్రాఫిక్స్‌ను సురక్షితంగా ఉంచేందుకు అక్రమ వలసదారులను ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరిని వెనక్కి పంపిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం దేశంలోని 6,000 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అభేద్యమైన భద్రతా గ్రిడ్‌ను అమలు చేస్తుందని చెప్పారు. స్మార్ట్ బోర్టర్ కాన్సెప్ట్ కింద రాడార్లు, అడ్వాన్స్‌డ్ కెమెరాలతో బీఎస్ఎఫ్‌ను అధునాతన టెక్నాలజీతో సన్నద్ధం చేస్తామని వివరించారు.


బీఎస్ఎఫ్‌ నేరుగా రాష్ట్ర పోలీసులు, జిల్లా కలెక్చర్లు, విలేజ్ పట్వారీల సమన్వయంతో ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని, అక్రమ చొరబాటుదారులను, పశువుల అక్రమ రవాణా మార్గాలను గురించాలని అమిత్‌షా సూచించారు. పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపుర రాష్ట్రాలను కలుపుకుని కలుపుతూ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు జరుగుతుందని, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోం శాఖ త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.


వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై మాట్లాడుతూ, సమస్యను కంట్రోల్ చేయడం కేవలం భద్రతగా చూడరాదని, ఈ బెడదను సమూలంగా పెకిలించాల్సిందేనని అన్నారు. వాపక్ష తీవ్రవాదం ఎలా నిర్మూలించామో అదే రేతిలో చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఫ్రంట్‌లైన్ జవాన్లకు సహకరించేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రఫీ మిషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు అమిత్‌షా ప్రకటించారు.


దేశభద్రతకు బీఎస్ఎఫ్ అందిస్తున్న సేలను అమిత్‌షా ప్రశంసించారు. 1965లో బీఎస్ఎఫ్‌ను కేవలం 25 బెటాలియన్లతో ప్రారంభించగా ఇప్పుడది 2,70,000 మందితో పటిష్టమైన దళంగా ఏర్పడిందని, ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా నిలిచిందని అన్నారు. సరిహద్దుల పటిష్టత విషయంలో బీఎస్ఎఫ్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా శత్రువును చిత్తుచేస్తూ వచ్చారని, దేశం ఎప్పుడూ తలవంచుకునే పరిస్థితి రాలేదని అన్నారు. విధి నిర్వహణలో అసమాన సేవలందించిన బీఎస్ఎఫ్ సిబ్బందిని హోం మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు.


ఇవి కూడా చదవండి..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు

హైవేపై సీసీటీవీ కళ్లు.. పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత!

Updated Date - May 22 , 2026 | 03:21 PM