Share News

కాక్రోచ్ జనతా పార్టీ విదేశీ శక్తుల కుట్ర?.. దర్యాప్తు చేస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు..

ABN , Publish Date - May 22 , 2026 | 03:44 PM

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) విదేశీ శక్తుల కుట్రంటూ భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ యువత అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అశాంతిని సృష్టించేందుకు వ్యూహం పన్నారనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ విదేశీ శక్తుల కుట్ర?.. దర్యాప్తు చేస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు..
Cockroach Janata Party

ఢిల్లీ: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) విదేశీ శక్తుల కుట్రంటూ భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ యువత అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అశాంతిని సృష్టించేందుకు వ్యూహం పన్నారనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ రావడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందేమోనని భావిస్తూ ఆరా తీస్తున్నారు.


న్యాయవ్యవస్థపై ఆర్టీఐ యాక్టివిస్టుల తీరును తప్పుబడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారిని బొద్దింకలతో పోల్చుతూ సీజేఐ ఘాటుగా స్పందించారు. సీజేఐ సూర్యకాంత్ తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వ్యంగ్యాత్మక ఉద్యమం పుట్టుకొచ్చింది. కేవలం 5 రోజుల్లోనే సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని 1.5 కోట్ల ఫాలోవర్సు దాటేశారు. అధికార బీజేపీ ఫాలోయింగ్‌నీ సీజేపీ దాటేయడం చర్చనీయాంశమైంది. నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీలు, ఆర్థిక ఇబ్బందులపై జెన్-జీ యువత డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వేదికగా ఉద్యమానికి దిగారు.


అయితే, ఒకే తరహా హ్యాష్‌ట్యాగ్‌లు, ఏఐ (AI) సాంగ్స్, సింక్రనైజ్డ్ పోస్టుల వెనుక డీప్ స్టేట్ ఐటీ సెల్స్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో భారతదేశంలో సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేశారు. అయితే, యువత వ్యంగ్య నిరసనను అణచివేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే 'దేశ వ్యతిరేక' ముద్ర వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నేతలు, విమర్శకులు మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ!

హాస్టల్‌లో యువకుడి దారుణం.. అర్ధరాత్రి అమ్మాయిల గదిలోకి చొరబడి..

Updated Date - May 22 , 2026 | 04:22 PM