Share News

ఇంటి మెట్లపై కూర్చోవడం మంచిది కాదా?

ABN , Publish Date - May 22 , 2026 | 03:08 PM

మనలో చాలామందికి ఇంటి మెట్లపై ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లపై కూర్చోవడం మంచిదా.. కాదా? దీనిపై వాస్తు నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి మెట్లపై కూర్చోవడం మంచిది కాదా?
Vastu Tips for Sitting on Stairs

ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి భాగానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంటుంది. ప్రధాన ద్వారం, వంటగది, పడకగది మాత్రమే కాదు, మెట్లు కూడా ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయని చెబుతారు. అందుకే మెట్లపై ఎక్కువసేపు కూర్చోవద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.


సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం

వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి (Positive Energy) ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రవహిస్తూ ఉంటుంది. మెట్లు ఆ శక్తి పైకీ, కిందకీ వెళ్లే మార్గంగా భావిస్తారు. అలాంటి చోట కూర్చోవడం వల్ల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని నమ్మకం. దీని వల్ల ఇంట్లో ఒత్తిడి, ఆందోళన పెరిగే అవకాశం ఉందని చెబుతారు.

ఆర్థిక సమస్యలు రావచ్చనే నమ్మకం

వాస్తు శాస్త్రంలో మెట్లను జీవితంలో ఎదుగుదలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే మెట్లపై ఎక్కువసేపు కూర్చోవడం లేదా అడ్డుగా నిలబడటం అభివృద్ధి మందగించడానికి కారణమవుతుందని కొందరు నమ్ముతారు. అలాగే ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చని కూడా చెబుతారు.


కుటుంబ వాతావరణంపై ప్రభావం

ఇంట్లో సానుకూల వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్థలు పెరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. మెట్లు మురికిగా ఉండటం లేదా అక్కడ కూర్చోవడం మంచిది కాదని చెబుతున్నారు.

ఆరోగ్యంపై కూడా ప్రభావం

మెట్లపై కూర్చోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదనంగా, మెట్ల దగ్గర దుమ్ము ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే మెట్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, వాటిపై ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఈ బలహీనతలే జీవితంలో సమస్యలకు కారణం

అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్

Updated Date - May 22 , 2026 | 03:37 PM