ఈ బలహీనతలే జీవితంలో సమస్యలకు కారణం
ABN , Publish Date - May 22 , 2026 | 01:00 PM
ఈ బలహీనతలే జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతాయని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. మరి మనిషిని బలహీనంగా మార్చే ఆ అలవాట్లు, స్వభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మనుషుల బలహీనతలు, అలవాట్ల గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పారు. కొందరు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోకుండా ఎప్పుడూ ఇతరులపై ఆధారపడుతుంటారని, అలాంటి వారు క్రమంగా ఇతరుల ప్రభావంలో జీవించే పరిస్థితికి చేరుకుంటారని ఆయన వివరించారు. మరి ఇతరులపై ఎక్కువగా ఆధారపడే వారిలో ఎలాంటి బలహీనతలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆత్మవిశ్వాసం లేకపోవడం
ఆత్మవిశ్వాసం లేని వారు తమ నిర్ణయాలపై నమ్మకం పెట్టుకోలేరు. చిన్న విషయానికైనా ఇతరుల సలహా కోసం ఎదురుచూస్తారు. ఇలా ఉండటం వల్ల ఇతరులు వారి బలహీనతను ఉపయోగించుకుని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు.
అందరినీ సంతోషపెట్టాలనే అలవాటు
కొంతమంది అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ తమ అవసరాలను, అభిప్రాయాలను పక్కన పెడతారు. ఈ అలవాటు వల్ల వారు సులభంగా ఇతరుల మాట వినే పరిస్థితికి చేరుకుంటారు.
భయం, అభద్రతా భావం
విఫలం అవుతామేమో, ఒంటరిగా మిగిలిపోతామేమో అనే భయంతో కొందరు ఇతరుల మాటే వింటూ ఉంటారు. భయంతో జీవించే వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించలేరని చాణక్యుడు చెప్పారు.
చెడు సాంగత్యం
తప్పుడు వ్యక్తులతో తిరగడం కూడా మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. స్వార్థపరులు, కుయుక్తులు చేసే వారు బలహీన మనస్తత్వం ఉన్నవారిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు.
తన విలువను మర్చిపోవడం
తమ కలలు, కోరికలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఇతరుల కోసం మాత్రమే జీవించడం కూడా పెద్ద బలహీనతే. ప్రతి వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని, తన నిర్ణయాలపై నమ్మకం పెంచుకోవాలని చాణక్యుడు సూచించారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి
తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం