ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ వాలెట్.. కొత్త ఫీచర్ అందుబాటులోకి
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:21 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు చివర్లో డాట్స్ ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ .. తాజాగా ‘చాట్ జీపీటీ వాలెట్’ లాంచ్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు చివర్లో డాట్స్ ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ .. తాజాగా ‘చాట్ జీపీటీ వాలెట్’ ను లాంచ్ చేసింది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఈ సదుపాయంతో యూజర్లు తమకు కావాల్సిన వస్తువుల గురించి ఏఐ ఏజెంట్‌కు చెబితే.. అది వివిధ వెబ్‌సైట్లలో ఉత్పత్తులను వెతికి, కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. అయితే, చెల్లింపులకు మాత్రం యూజర్ల అనుమతి కావాల్సిందే.
ప్రతి కొనుగోలుకూ అనుమతి తప్పనిసరి
ప్రస్తుతానికి అమెరికాలో 18 ఏళ్లు నిండిన, అమెరికా జారీ చేసిన కార్డులు ఉన్న చాట్ జీపీటీ ప్రోసబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును ఒకసారి వాలెట్‌కు అనుసంధానిస్తే చాలు. ఆ తర్వాత ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఏజెంట్లు దానిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఏజెంట్లు తమకు నచ్చినట్లు కొనుగోళ్లు చేయడానికి వీల్లేదు. ప్రతిసారీ కొనుగోలు చేసే వస్తువులు, మొత్తం ధర, పేమెంట్లకు ఉపయోగించే కార్డు వివరాలను వినియోగదారులు పరిశీలించాలి. ఫేస్ ఐడీ లేదా వేలిముద్రతో అనుమతి ఇచ్చిన తర్వాతే చెల్లింపు జరుగుతుంది. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు కూడా రికార్డవుతాయి.
కార్డు వివరాలు రహస్యం..
ఈ ఫీచర్‌లో భద్రతకు ఓపెన్ ఏఐ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. వినియోగదారుల అసలు కార్డు వివరాలు ఏఐ ఏజెంట్‌కుగానీ, కంపెనీలకుగానీ అందుబాటులో ఉండవు. వాటికి బదులుగా పేమెంట్ నెట్‌వర్క్ ప్రత్యేక టోకెన్‌ను రూపొందిస్తుంది. ఈ టోకెన్ అసలు కార్డు వివరాలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. యాపిల్ పే, గూగుల్ వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు సేవల్లోనూ ఇదే తరహా టోకెన్ విధానం అమల్లో ఉంది. ఈ సదుపాయం కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మాస్టర్‌కార్డ్, వీసా సంస్థలతో ఓపెన్ ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థలతో ఈ ఫీచర్ పనిచేసేలా రూపొందించినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..