దీపావళి వెలుగుల్లో మీ ఫొటోలు మెరిసిపోవాలా? ఈ చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్ వాడండి!
ABN , Publish Date - Nov 08 , 2026 | 10:37 AM
మీ మామూలు ఫొటోలకు పండుగ కళ తీసుకురావాలా..? అయితే ఈ చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్ ఉపయోగపడతాయి.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వేళ ప్రత్యేకమైన ఫొటోలను చాలామంది కోరుకుంటారు. దీపాల వెలుగుల జిలుగుల మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగాలని అనుకుంటారు. అయితే ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం చాట్‌జీపీటీ, జెమినిలను ఆశ్రయించొచ్చు. ఒక్క మాట చెబితే (ప్రాంప్ట్ ఇస్తే) చాలు.. ఏఐ మామూలు ఫొటోల్లోకి పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. సంప్రదాయ దుస్తులలో మిమ్మల్ని అలంకరిస్తుంది. మీకు నచ్చినట్టుగా ఫొటోలను ఎడిట్ చేసి పెడుతుంది. ఇది చేయడం చాలా సులభం కూడా. మీ రియల్ ఫొటోలను చాట్‌జీపీటీకి ఇవ్వండి. అలాగే దీపావళికి సంబంధించిన ప్రాంప్ట్ పంపండి. అంతే మిగతా పని ఆ ఏఐ చూసుకుంటుంది. అయితే ప్రాంప్ట్‌తో పాటు ఇచ్చే ఫొటోలో ఫేస్ క్లియర్‌గా ఉండాలని గుర్తుపెట్టుకోండి.
దీపావళి ఫొటోల కోసం ప్రాంప్ట్స్ ఇవే..
1. సంప్రదాయంగా ఉండే దీపావళి ఫొటో కోసం కింది ప్రాంప్ట్ వాడండి
"Use my uploaded photograph to create a realistic Diwali portrait. Dress me in an elegant traditional Indian outfit with rich festive colours. Add a beautifully decorated background with glowing diyas, marigold flowers and warm golden lighting. Keep my facial features natural and unchanged."
2. దీపావళి రాయల్ లుక్ కోసం ఈ ప్రాంప్ట్
"Transform my photograph into a royal festive portrait. Give me an elegant traditional Indian outfit with intricate embroidery and subtle jewellery. Use a luxurious palace-inspired background with warm lighting. Maintain my original face and natural appearance."
3. దీపాల మధ్య ఫొటో కోసం ఇది ఉపయోగించండి
"Create a beautiful Diwali portrait using my uploaded photograph. Show me holding a traditional diya with a warm smile. Add softly glowing lamps, floating flower petals and a festive background. Make the image look realistic and cinematic."
4. సకుటుంబ సపరివార సమేతంగా ఉన్న చిత్రాన్ని రూపొందించటం కోసం ఈ ప్రాంప్ట్ సహాయపడుతుంది
"Turn our uploaded family photograph into a beautiful Diwali portrait. Dress everyone in coordinated traditional Indian outfits. Add diyas, rangoli and festive decorations in the background. Preserve everyone's facial features and expressions."
5. పండుగ సందర్భంగా శారీ లుక్ కోసం ఇది ట్రై చేయండి.
"Create a stunning Diwali portrait from my uploaded photograph. Dress me in a beautiful traditional silk saree with elegant jewellery. Add a festive background featuring glowing diyas, marigold decorations and warm fairy lights. Keep my face realistic and unchanged."
ఇవీ చదవండి
దీపావళి వేళ ఇవి దానం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్నీ శుభాలే
దీపావళికి టపాసులు కాలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!