తోడికోడళ్ల పోరులో..
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:42 AM
ఆచంట మండలం పెదమల్లం ఎంపీటీసీ స్థానానికి తోడికోడళ్లు పోటీపడ్డారు. జనసేన నుంచి బోడపాటి మంగాదేవి, వైసీపీ నుంచి బోడపాటి మౌనీ సుప్రియ పోటీచేయగా...
ఆచంట మండలం పెదమల్లం ఎంపీటీసీ స్థానానికి తోడికోడళ్లు పోటీపడ్డారు. జనసేన నుంచి బోడపాటి మంగాదేవి, వైసీపీ నుంచి బోడపాటి మౌనీ సుప్రియ పోటీచేయగా... మంగాదేవి 9 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రీకౌటింగ్‌లోనూ మంగాదేవికి 10 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక్కడ నోటకు 8 ఓట్లు రాగా, చెల్లని ఓట్లు 54 ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎంఎస్ పల్లి ఎంపీటీసీ స్థానానికి తోడికోడళ్లు పోటీపడ్డారు. టీడీపీ నుంచి బుడ్డేపు లక్ష్మి, వైసీపీ నుంచి బుడ్డేపు కురమ్మ పోటీ చేయగా.. కురమ్మ గెలిచారు.
అనంతపురం జిల్లా నార్పల ఎంపీటీసీలుగా వైసీపీ నుంచి తోడికోడళ్లు గెలిచారు. నార్పల-3వ ఎంపీటీసీగా స్వాతిలత, నార్పల-4వ ఎంపీటీసీగా ప్రసన్నలత విజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు-1 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి గొండు అరుణ, అంపోలు-3 ఎంపీటీసీ నుంచి టీడీపీ అభ్యర్థి గొండు ధాత్రీదేవి గెలుపొందారు. ఇద్దరూ తోడికోడళ్లు.
తల్లి చేతిలో కుమార్తె ఓటమి
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కోటశిర్లాం ఎంపీటీసీ ఎన్నికల్లో బప్పడాల వెంకటలక్ష్మి వైసీపీ తరపున పోటీ చేయగా, ఆమె కూతురు జయలక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేశారు. తల్లి వెంకటలక్ష్మి 24 ఓట్ల మెజార్టీతో కూతురిపై గెలుపొందారు.
తండ్రీకూతుళ్లు చెరో పార్టీ నుంచి..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎంపీటీసీలుగా తండ్రి, కూతురు గెలుపొందారు. కూతురు పొనుగుపాటి చాందిని టీడీపీ నుంచి కొత్తపేట-2వ ఎంపీటీసీగా 1290 మెజారిటీతో, ఆమె తండ్రి పలివెల-2 ఎంపీటీసీగా వైసీపీ నుంచి 177 మెజారిటీతో గెలిచారు.
కలిసి నడిచారు.. కలిసి గెలిచారు!
కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో దంపతులు విజయం సాధించారు. ప్రత్తిపాడు ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న యాళ్ల మంగాదేవి ఎంపీటీసీ-3 స్థానం నుంచి 1,138 మెజారిటీతో, ఆమె భర్త యాళ్ల జగదీశ్ ఎంపీటీసీ-2 స్థానం నుంచి 1358 మెజారిటీతో గెలుపొందారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..